ఏంటి నిజమా అని అనుకుంటున్నారా ? అవును నిజంగానే రామ్ గోపాల్ వర్మ చెంపపై కొట్టింది ఆషు రెడ్డి. కాకపోతే ఇదంతా ఓ ఇంటర్వ్యూలో భాగంగానే జరిగింది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ ఆషు రెడ్డి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
This video has been co directed by @AshuReddi and Me and produced by #BhalaEntertainments https://t.co/Kc429RDMFP ..Don’t Enjoy
— Ram Gopal Varma (@RGVzoomin) September 2, 2021
ఈ టీజర్లో ఆషు రెడ్డి ఒక కాఫీ షాపులో కూర్చొని ఉండగా.. రామ్ గోపాల్ వర్మ కూడా అదే కాఫీ షాపులోకి వెళ్తాడు. అక్కడకు వెళ్లి ఆషు రెడ్డి పక్కన కూర్చొంటాడు. ఆషు రెడ్డిని పలకరిస్తాడు. కానీ ఆషురెడ్డి ఆర్జీవీని గుర్తు పట్టనట్టుగా మాట్లాడుతుంది. ఇంతలో ఆషు రెడ్డిపై తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేస్తాడు. దీంతో కోపంతో ఆర్జీవీ చెంపపై ఒక్కటి ఇస్తుంది. అక్కడితో వీడియో అయిపోతుంది. ఆషు రెడ్డి నుంచి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ అంటూ ఈ వీడియో ముగుస్తుంది. ఆర్జీవీ ట్వీట్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్య వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?