Ashu Reddy | జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ అషూ రెడ్డి. కొన్నేళ్లపాటు యాంకర్‌గానూ రాణించిన ఈ భామ రామ్ గోపాల్ వర్మతో రచ్చ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సోషల మీడియాలో ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకుంటుంది. ఛల్ మోహనరంగ, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, ఎ మాస్టర్ పీస్ వంటి చిత్రాలలోను నటించి అలరించింది. అయితే అషూ రెడ్డి బయటకి ఆనందంగా కనిపించిన ఆమె చావు చివరి అంచు వరకు వెళ్లి వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అషూ రెడ్డి బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే తాజాగా ఇన్ స్టా ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను ఆ సమయంలో ఎన్ని కష్టాలు పడిందో తెలియజేసింది. ఆ వీడియో చూస్తే ఎవరికి కన్నీళ్లు ఆగడం లేదు. అషూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. హాస్పిటల్ బెడ్ పై తీసిన ఆ షాట్స్, తలపై మెడికల్ బ్యాండేజీ, షేవ్ చేసిన హెయిర్ లైన్.. ఇవన్నీ ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. వీడియోకి క్యాప్షన్‌గా అషూ రెడ్డి.. లైఫ్ అంటే ఇదే.. దయతో ఉండండి, గొప్పలకు పోకుండా ఉండండి. ఇది ఎంతో మందిని కాపాడుతుంది. నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా, ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అషు రెడ్డి తన పోస్ట్‌లో తెలియజేసింది.
చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలోని ‘ఓడిపోవడం తప్పు కాదురా’ అనే లిరిక్స్ ను ఆ వీడియోకు యాడ్ చేసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్రెయిన్ సర్జరీ నుంచి విజయవంతగా బయటపడినందుకు కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా, మరి కొందరు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోమని కామెంట్ చేస్తున్నారు.