Ashu Reddy | జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మొదట్లో టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు ఛల్ మోహన్ రంగా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇందులో అషూ నటనకి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకి షోలో పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత అషూ రేంజ్ పెరిగిపోయింది. అషురెడ్డి రెండు సార్లు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. చూడ్డానికి అచ్చం సమంత లాగే ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు రాగా, అది తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తనని అషురెడ్డిగానే ప్రేక్షకులు గుర్తించాలని కోరకుంటున్నట్లు తెలిపింది.
అయితేఎంతో చలాకీగా సరదాగా ఉండే అషురెడ్డికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట. హెయిర్ తీసేసి సర్జరీ కూడా చేసినట్టు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2024లో కామాఖ్య టెంపుల్‌కి వెళ్లినప్పుడు తనకి విపరీతమైన తలనొప్పి వచ్చిందట. ఐదు రోజుల పాటు డోలో వేసుకున్నా కూడా నొప్పి తగ్గలేదు. తల అంతా బరువుగా ఉండేది. తల కూడా లేపలేని పరిస్థితి వస్తే.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్టులు చేయించుకన్నాను. అప్పడు బ్రెయిన్ లో టమాటా సైజ్ అంతా ట్యూమర్ ఉందట. అది చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ట్యూమర్ ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్‌కి రెడీ చేశారు.
డబ్బులు ముందు ఏమి అడగకుండానే సర్జరీ చేశారు. ఆసుపత్రిలో 10 రోజులు ఉన్నాను. సర్జరీ టైమ్‌లో సగం జట్టు తీసారు. అయితే ట్యూమర్ తీసేటప్పుడు నరాలు డిస్ట్రబ్ అయితే మెమోరీ లాస్ అవ్వొచ్చు లేదంటే ఏదైన జరగొచ్చు అని ముందే నన్ను ప్రిపేర్ చేశారు. కాని ఆపరేషన్ బాగానే అయింది. గట్టిగా మాట్లాడలేకపోయాను. ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కాని ఖాళీగా కూర్చోలేక రెండు నెలలకే షూట్‌కి వెళ్లాను. హెయిర్ స్టయిలిష్ట్స్ విగ్స్ తో సెట్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. పనిలో పడడం వల్లనే త్వరగా రికవరీ అయ్యాను అని అషూ పేర్కొంది. అయితే ఎంతో సరదా సరదాగా ఉండే అషూ ఇన్ని బాధలు పడిందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.