Ashu Reddy | జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు, టీవీ షో లతో బిజీగా ఉండే ఈ అమ్మడు ఆ మధ్య రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఈ అమ్మడి బోల్డ్ నెస్ కు అద్దం పట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామ తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. అషూ రెడ్డి షేర్ చేసిన బోల్డ్ పిక్స్‌కి ఒక్కోసారి లక్షల కొద్ది లైక్స్ వస్తుంటాయి. అయితే సరదాగా సాగుతున్న ఆమె జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. తనకి బ్రెయిన్ సర్జరీ చేయగా, ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితం తెలియజేసింది. ఇదీ జీవితమంటే.. ఎప్పుడూ దయ, కరుణతో ఉండండి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మంచింది అని అషూరెడ్డి ఓ వీడియో పోస్ట్ చేసింది.
అందులో తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి శస్త్రచికిత్స చేసేముందు, చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పి అందరు ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక సర్జరీ కోసం తన హెయిర్ కూడా కాస్త షేవ్ చేసుకోవల్సి వచ్చిందని కూడా అషూ పేర్కొంది. అయితే సర్జరీ చేశాక జిమ్, యోగా చేసి .. తిరిగి కెమెరా ముందుకు వచ్చిన వీడియోలని కూడా అషూ పంచుకుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, సెలబ్రెటీలు అషూరెడ్డి నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని కామెంట్ చేశారు. అయితే అషూ గత ఏడాది జూన్ 4 న సర్జరీ చేయించుకుంది. నిన్నటితో ఏడాది పూర్తి కావడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తన ఇన్‌స్టాలో బ్లాక్ ఫారెస్ట్ కేక్ షేర్ చేయగా, దానిపై ఫైటర్ అని రాసి ఉంది. ఇక కింద కామెంట్లో నా బ్రెయిన్ సర్జరీ పూర్తై ఏడాది అయింది. నేను ఎప్పుడు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. థ్యాంక్యూ గాడ్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అషూ రెడ్డి పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే అషూ రెడ్డి రీసెంట్గా కామాఖ్య శక్తి పీఠంలో పూజలు చేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఈ అమ్మడు గతంలో అనేకమార్లు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. వారి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పరిహారంగా చేయవలసిన పూజలను వేణు స్వామి చేసినట్టు అర్ధమైంది.