Ashta Chamma Movie | అష్టా చమ్మా సినిమా 15వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ టీమ్ మొత్తం ఒక చోటుకు చేరింది. అష్టా చమ్మా అంటూ ఓ సెట్టింగ్ వేసుకుని టీమ్ అంతా కలిసి చిన్న పార్తీ చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైలర్ అవుతున్నారు. ఈ సినిమా హీరోలు నాని, అవసరాల శ్రీనివాస్ సహా హీరోయిన్ కలర్ స్వాతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. ఇక దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్‌తో సినిమాకు పని చేసిన పలువురు ఈ పార్టీలో కలిసి సందడి చేశారు.
పదిహేనేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున రిలీజైన అష్టా చమ్మా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయింది. ఈ సినిమాతోనే నాని, అవసరాల శ్రీనివాస్‌లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేష్ బాబు, రామ్ మోహన్‌తో కలిసి నిర్మించాడు. కోటిన్నరతో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో రూ.4.5 కోట్లు కొల్లగొట్టి మంచి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.