Ashoka Vanamlo Arjuna Kalyanam on OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సక్సెస్‌తో జోష్ మీదున్నాడు. ‘ఫలక్‌నూమా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘హిట్’ వంటి సీరియస్ పాత్రల్లో నటించిన విశ్వక్ ఈ సారి పూర్తి భిన్నంగా వినోధాత్మక పాత్రలో నటించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే6 న విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. విడుదలకు ముందు ఈ చిత్రంపై అంతగా బజ్ లేదు. కానీ విశ్వక్ జరిపిన ప్రాంక్ వీడియో నెగిటీవ్‌గా వైరల్ అవడంతో ఈ సినిమాకు ఒక రేంజ్లో పబ్లిసిటీ అయింది. ఇక ఈ చిత్రంలో విశ్వక్ మేకోవర్‌కు, అర్జున్ పాత్రలో ఒదిగిపోయిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్‌లు కథానాయికలుగా నటించారు. బీవిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్విసిసి బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మలయళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. దీనితో పాటు విశ్వక్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.
Arjun Kumar Allam, pelli koothurni vetthukuntu aha ki vacchesthunnadu 🥁
Pelli date fix! Pellikuthuru evaro mari? #ahapuramloArjunaKalyanam June 3 nundi!! @VishwakSenActor @RuksharDhillon @BvsnP #BapineeduB @sudheer_ed @storytellerkola @vidya7sagar
@SVCCDigital @SVCCofficial pic.twitter.com/FDRj5o19NA— ahavideoin (@ahavideoIN) May 27, 2022