Devaki Nandana Vasudeva | మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్‌వర్మ కథనందించారు. ఈ నెల 22న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో సుధీర్‌బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బోయపాటి శ్రీను.. సినిమా అద్భుతంగా వచ్చిందని, విజువల్స్, మ్యూజిక్ అదిరిపోయాయని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ప్రశాంత్‌వర్మ కథనందించాడంటే తప్పకుండా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని, ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ ‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్.
తన పాత్ర కోసం అశోక్ సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. అనేక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది’ అన్నారు. డివైన్ కంటెంట్‌తో తీసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు అర్జున్ జంధ్యాల తెలిపారు. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్‌తో అందరిని మెప్పించే చిత్రమని హీరో అశోక్ గల్లా పేర్కొన్నారు.