Ashish Vidyarthi – Ashutosh Gowariker | బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థికి ఎయిర్‌పోర్ట్‌లో ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక అభిమాని సోషల్ మీడియా వ్లాగ్ చేసుకుంటూ వెళుతూ.. ఆశిష్ విద్యార్థిని పొరపాటున బాలీవుడ్ దర్శకుడు ఆశుతోష్ గోవారికర్ అని పిలిచింది. అయితే దీనిపై ఆశిష్ స్పందించిన తీరు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఒక అభిమాని ఎయిర్‌పోర్ట్‌లో వెళుతుండగా.. ఆమెకి ఆశిష్ విద్యార్థి కనిపించడంతో.. హలో ఫ్రెండ్స్ నాతో పాటు విమానంలో ఎవరు ప్రయాణిస్తున్నారో చూడండి.. నాతోపాటు ఆశుతోష్ గోవారికర్ వస్తున్నారు అంటూ ఆశిష్ పేరును తప్పుగా పిలిచింది. అయితే ఆశిష్ ఆమె మాటలు విని నవ్వకుండా, చాలా కూల్‌గా స్పందించారు.
ఆశిష్ విద్యార్థి ఆమె దగ్గరికి వచ్చి.. రూమి మీరు ఈ వీడియోను ఎడిట్ చేయనని ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఇది నా ప్రత్యేకత. దీనికోసం మీరు ‘కపిల్ శర్మ షో’ చూడండి. ప్రతిసారి నన్ను చాలా మంది వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అలాగే నన్ను ఆశుతోష్ గోవారికర్ అని పిలవడం కూడా ఇదే మొదటిసారి. అన్నాడు. అయితే అభిమాని మాట్లాడుతూ.. తాను సరిగ్గానే గుర్తించానని పట్టుబట్టినప్పటికీ, ఆశిష్ విద్యార్థి చాలా సౌమ్యంగా, “నా పేరు ఆశిష్ విద్యార్థి” అని సరిదిద్దారు. దీంతో ఆ అభిమాని కాస్త ఇబ్బంది పడి, తన తప్పును తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read More