‘కాలేజీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని కలలుకనే కొందరు కుర్రాళ్ల కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు శ్రీహర్ష కొనుగంటి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కరికి తమ కాలేజీ జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది. మా కుటుంబం నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది. అతడి నటన, డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని హంగులుంటాయి. అభినయానికి ప్రాముఖ్యమున్న పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, మది సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు.