Captain Movie On OTT | తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కెప్టెన్’. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుని ఫ్లాప్‌గా మిగిలింది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ అంత ఎంగేజింగ్‌గా లేకపోవడం, కథనం కూడా సాగదీతగా ఉండటం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అని ప్రేక్షకులు తెలిపారు. శత్రుదేశాలు మన ఆర్మీ సైన్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఏలియన్స్ లాంటి జీవులను ఇక్కడికి పంపిస్తారు. ఈ ఏలియన్స్‌ను ఆర్య టీమ్ ఎలా అంతమొందించింది అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సిమ్రాన్ కీలకపాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ విడుదల గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో మేకర్స్ ‘కెప్టెన్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీ డిజిటల్ హక్కులను ‘జీ-5’ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ౩౦నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనే ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో ఆర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. థింక్ స్టూడీయోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక ఈ మూవీని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశాడు. తెలుగులో ఈ చిత్రానికి రూ.1.61 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో కోటీ రూపాయలు సాధించి ఫ్లాప్‌గా మిగిలింది.
Read Also:
Dhamaka Movie | ‘ధమాకా’ సెకండ్ సింగిల్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొడుతున్న రవితేజ
Vikram Movie | 100ఏళ్ళ కోలీవుడ్ సినీ చరిత్రలో.. ‘విక్రమ్’ మూవీ సంచలన రికార్డు
Ira Khan | ఫిట్నెస్ ట్రైనర్‌తో బాలీవుడ్ స్టార్ హీరో కూతురు ప్రేమాయణం.. వీడియోతో అఫిషియల్ ప్రకటన
AK61 Movie | 11 ఏళ్ళ తర్వాత నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్..!