The Ba***ds of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందరూ ఆర్యన్ ఖాన్ హీరోగా పరిచయం అవుతారని ఎదురుచూశారు. అయితే వీరి షాక్ ఇస్తూ.. తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించాడు.
ఆర్యాన్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ది బ్యాడస్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood). ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు అగ్ర నటులు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. షారుఖ్, ఆర్యన్ ఇంట్రోతో వచ్చిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. నెట్ ఫ్లిక్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.