Shah Rukh Khan | షారుక్ సినిమాలపై ఆర్యన్ కేసు ఎఫెక్ట్
డ్రగ్స్ కేసులో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైల్లో (Arthur Road prison) ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో షారుక్‌ఖాన్ ఇప్పటికే తన సినిమాల షూటింగ్స్ వాయిదా వేసుకున్నాడు.

డ్రగ్స్ కేసులో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan)ను ఈ నెల 3న ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైల్లో (Arthur Road prison) ఉన్నాడు. అప్పటి నుంచి ఆర్యన్ జైల్లోనే ఉండగా..అతని బెయిల్‌పై బుధవారం ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో షారుక్‌ఖాన్ ఇప్పటికే తన సినిమాల షూటింగ్స్ వాయిదా వేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ముందుగా అనుకున్న ప్రకారం పఠాన్ (Pathan) షూటింగ్ స్పెయిన్‌లో జరుగాల్సి ఉంది. ఇప్పటికే డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ అక్టోబర్ 2న స్పెయిన్‌కు వెళ్లాడు.
ఆర్యన్ అరెస్ట్ తర్వాత మళ్లీ భారత్‌కు తిరిగొచ్చాడు. రెండు పాటల చిత్రీకరణ కోసం మేకర్స్ స్పెయిన్‌లోనే ఉన్నారు. మల్లోర్కా, కాడిజ్, వెజెర్, ఫ్రొంటెరా ప్రాంతాల్లో ఈ పాటలు షూట్ చేయాలని ప్లాన్ చేశాడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). ఈ లొకేషన్లలో షూటింగ్ జరుపుకోబోతున్న తొలి చిత్రం పఠాన్ కావడం విశేషం. అయితే సిద్దార్థ్ ఇండియాకు రావడంతో షూటింగ్‌పై స్పష్టత లేకుండా పోయిందని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి స్పెయిన్ షెడ్యూల్‌ను షారుక్ రద్దు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు డైరెక్టర్ ఆట్లీ సినిమా షూట్‌కు కూడా షారుక్ హాజరయేందుకు రెడీగా లేడు. దీంతో షారుక్‌ఖాన్ డూప్ ప్రశాంత్ వాల్దే ఇతర నటీనటులతో కొన్ని సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ఆట్లీ. మరో్వైపు సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న టైగర్ 3 (Tiger 3)లో షారుక్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్యన్ కేసును సల్మాన్ ప్రతీ రోజు పర్యవేక్షిస్తూ, షారుక్‌ను ప్రతీ రోజూ కలుస్తున్నాడని సమాచారం.
ఆర్యన్ బెయిల్ తీర్పు తర్వాత షారుక్ ఖాన్ షూటింగ్స్ పున: ప్రారంభంపై స్పష్టత రానుంది. ఆర్యన్ కేసు వ్యవహారం షారుక్ సినిమాలపై చాలా ఎపెక్ట్ పడిందని తాజావార్తలతో స్పష్టతమవుతోంది.
ఇది కూడా చూడండి
నా కొడుకు జైలు నుంచి ఇంటికొచ్చే వరకూ నో ఖీర్, నో స్వీట్స్: గౌరీ ఖాన్
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

