సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆర్టిస్ట్’. రతన్ రిషి దర్శకుడు. జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు రతన్ రిషి మాట్లాడుతూ ‘ఇదొక సైకో థ్రిలర్. సస్పెన్స్, భయం కామెడీ, రొమాన్స్ ఇందులో మెండుగా ఉంటాయి. ఓ ఉద్వేగపూరితమైన కథ ఇది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఆడియన్‌కి అద్భుతమైన ఫీల్‌ని కలిగిస్తుంది. సాంకేతికంగా కూడా ఆకట్టుకుంటుంది.’ అని తెలిపారు. సమాజంలోని ఓ సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పేషన్ ఉన్న నిర్మాత దొరకడం తమ అదృష్టమని హీరో సంతోష్ అన్నారు. మంచి కంటెంట్‌తో ఈ సినిమా నిర్మించామని నిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము చెప్పారు. ఇంకా కథానాయిక క్రిషేక పటేల్. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తదితరులు మాట్లాడారు.