అడవిని పునఃసృష్టించాం

‘దర్శకుడు సుకుమార్ సాంకేతిక నిపుణుల ప్రతిభకు విలువనిస్తుంటారు. ఆయనతో పనిచేయడం ప్రతిసారి కొత్త అనుభూతిని పంచుతుంది’ అని అన్నారు కళా దర్శకద్వయం రామకృష్ణ, మోనిక. వారు కళాదర్శకులుగా పనిచేసిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా రామకృష్ణ, మోనిక పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
మైత్రీమూవీ మేకర్స్‌లో మేము చేసిన నాలుగో చిత్రమిది. కళాదర్శకులుగా ‘పుష్ప’ చిత్రం మాకు పెద్ద చాలెంజింగ్‌గా నిలిచింది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం అడవుల్లో కనిపించే వాతావరణాన్ని హైదరాబాద్‌లో పునసృష్టించాల్సివచ్చింది. సెట్ అనే భావన ప్రేక్షకుల్లో రాకుండా ఒరిజినాలిటీ ఫీలింగ్ కలిగేలా సెట్స్ వేశాం. కేరళలో జలపాతం నేపథ్యంలో తెరకెక్కించాల్సిన సన్నివేశాలను కొవిడ్ వల్ల ఇక్కడే సెట్‌వేసి చిత్రీకరించాం. మారేడుమిల్లి నేటివిటీని సహజంగా సెట్స్ ద్వారా సినిమాలో చూపించడానికి చాలా కష్టపడ్డాం. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో 1998-2005 మధ్యకాలాల నేపథ్యంలో సినిమా సాగుతుంది.
బన్నీ ప్రోత్సహిస్తుంటారు..
నటనకు పరిమితం కాకుండా సాంకేతిక నిపుణుల పనితీరును బన్నీ గుర్తించి ప్రోత్సహిస్తుంటారు. మేము వేసిన సెట్స్‌ను పరిశీలించి మెచ్చుకునేవారు. బాగాలేదు అనే మాట ఏ రోజు సుకుమార్, బన్నీ నోటి నుండి రాలేదు. కథ, సీన్‌కు తగినట్లుగా సెట్స్ వేసినప్పుడే నటీనటులు ఆ మూడ్‌లోకి వెళ్లి బాగా నటించగలుగుతారు. ఈ సినిమా కోసం దాదాపు పదమూడు సెట్స్ వేశాం. ైక్లెమాక్స్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్ హైలైట్‌గా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో కూడిన రియలిస్టిక్ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఎంతో తపన, ధైర్యంతో నిర్మాతలు నవీన్, రవిశంకర్ నిర్మించారు. సాంకేతిక నిపుణులకు వారు పూర్తిస్వేచ్ఛనిస్తుంటారు. అలాంటి నిర్మాతలు తెలుగు చిత్రసీమలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమాకు ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

