హీరో నాని ప్రస్తుతం యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఈ మధ్యే ‘ప్యారడైజ్’ సినిమా గ్లింప్స్‌లో బలవంతులను ధిక్కరించే సామాన్యుడిగా పవర్ఫుల్ యాక్షన్‌ను పండించారు. మరోవైపు ‘హిట్-3’లో రూత్‌లెస్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నేరస్థులపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్ఫుల్ ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకుడు. మే 1న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమాలోని ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్..’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. అర్జున్ సర్కార్ రాజీపడని వ్యక్తిత్వాన్ని, దూకుడు స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. శత్రువులపై ప్రతీకారం తప్పదనే హెచ్చరికలతో ఈ పాట పవర్‌ఫుల్‌గా సాగింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, రచన-దర్శకత్వం: డా॥ శైలేష్ కొలను.