అర్జున్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించకూడదని తన మనసు చెప్పిందని, ఆ సందేహంతోనే షూటిం గ్ వద్దనుకున్నానని అ న్నారు హీరో విశ్వక్సేన్. అర్జున్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ నటించాల్సిన సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. విశ్వక్ షూటింగ్‌కు రాకపోవడం వల్లే సినిమాను నిలిపివేశామంటూ అర్జున్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై విశ్వక్సేన్ స్పం దిస్తూ…‘అర్జున్ సినిమాలో నటించేందుకు నాకేమీ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ కథ విషయంలో నాకున్న సూచనలను ఏవీ అర్జున్ పరిగణలోకి తీసుకోలేదు. ఆయనను ఏది అడిగినా నేను చూసుకుంటా కదా అనేవారు. ఈ సినిమా వదిలేస్తే మంచిదనేది మనసులో తట్టింది.
నా వల్ల ఇప్పటిదాకా ఏ నిర్మాతకూ నష్టం కలగలేదు. ఎ న్నో ఆడిషన్స్‌కు వెళ్లి, ఆఫీసుల చుట్టూ తిరి గి కిందస్థాయి నుంచి హీ రోగా ఎదిగిన నేను సిని మా ఎంపిక విషయంలో తప్పు చేస్తే మళ్లీ అక్కడికే వెళ్తాననే భయం మొదలైంది. కథ గురించి మరోసారి చర్చిద్దామని చెప్పాను. అర్జున్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని అనుకోలేదు. వాళ్లు ఇచ్చిన డబ్బులకు అకౌంట్ సెటిల్ చేయమని సంప్రదించారు’ అని చెప్పారు. మూడు నెలల కిందట అర్జున్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా సినిమా ప్రారంభమైంది. పలుమార్లు అంతా సిద్ధం చేసుకున్నాక విశ్వక్ షూటింగ్‌కు రాకపోవడం వల్లే సినిమా ఆపేశామని ఇటీవల అర్జున్ వెల్లడించారు.