Vidaamuyarchi | అజిత్‌కుమార్ కథానాయకుడిగా కోలీవుడ్‌లో రూపొందుతోన్న పాన్ఇండియా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకుడు. అజిత్, లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం అర్జున్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ లుక్‌లో రోడ్‌పై అర్జున్ ైస్టెలిష్‌గా నిలబడివున్నారు. నేపథ్యంలో అజిత్ షాడోగా కనిపిస్తున్నాడు. అర్జున్, అజిత్ పాత్రలపై ఆసక్తిని పెంచేలా ఈ పోస్టర్ ఉంది. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్'(కష్టం ఎప్పటికీ వృథాకాదు) అని అర్థం వచ్చేలా ఓ వాక్యం కూడా ఈ పోస్టర్‌పై కనిపిస్తున్నది. త్రిష ఇందులో కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాశ్, సంగీతం: అనిరుథ్.