Arjun Das | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లుపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రీసెంట్గా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రైలర్‌లోని బేస్ వాయిస్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఆ వాయిస్ ఇచ్చింది మరెవరో కాదు తమిళ నటుడు అర్జున్ దాస్. ఈ తమిళ యాక్టర్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ దాస్ తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చి అలరించాడు.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ తన ఎక్స్‌లో.. ”పవన్ కళ్యాణ్ తన సినిమా ట్రైలర్ కి వాయిస్ ఇవ్వమని అడిగినప్పుడు, మనం అవును అనకుండా ఎలా ఉంటాము. ఎవరూ ప్రశ్నలు అడగరు. ఇది మీ కోసమే సార్. మీకు, మీ మొత్తం వీరమల్లు బృందానికి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. దీనికి పవన్ తాజాగా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసారు. “నీ గొంతులో మ్యాజిక్ ఉంది” . నీకు నేను రుణపడి ఉంటాను. నేను ఎవరినైనా చాలా అరుదుగా సహాయం అడుగుతాను. నా అభ్యర్థనను మన్నించినందుకు ధన్యవాదాలు. నీ గొంతులో అద్భుతమైన మ్యాజిక్ తో పాటు మెలోడీ ఉన్నాయి అని పవన్ ప్రశంసల జల్లు కురిపించారు.
దీనికి అర్జున్ దాస్..పవన్ కళ్యాణ్ సార్ ఈ మెసేజ్ నాకు ఎంత విలువైందో మీకు తెలియదు. మీరు చాలా అరుదుగా సహాయం కోరే వ్యక్తి అని నాకు తెలుసు. అయితే అరుదైన సందర్భాలలో, మీరు నన్ను అడగాలని అనుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, మీ విషయానికి వస్తే, నేను ఎల్లప్పుడూ ఒక కాల్ లేదా మెసేజ్ దూరంలో ఉంటానని దయచేసి గురుంచుకోండి అంటూ అర్జున్ దాస్ చాలా ఎమోషనల్ కామెంట్ చేశారు. ఇక పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదల కానుంది. పవన్ కల్యాణ్ పవర్‌పుల్ లుక్, భారీ నిర్మాణ విలువలు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కంపోజిషన్ అన్నీ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.