Bomb Teaser | తమిళ నటుడు అర్జున్ దాస్ ఒకవైపు సహాయక పాత్రలలో నటిస్తునే మరోవైపు హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బాంబు (bomb). ఈ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుంది. కాళి వెంకట్, నాజర్, అభిరామి, సింగంపులి, బాలశరవణన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గేమ్ బ్రో పిక్చర్స్ బ్యానర్‌పై సుధ సుకుమార్, సుకుమార్ బాలకృష్ణన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే.. కాళి వెంకట్ చనిపోయాడు అనుకుని అందరూ ఏడుస్తుంటే.. అతడు సడన్‌గా అపానవాయువు(Fart) వదులుతుంటాడు. దీంతో అతడు చనిపోయాడా లేదా అనే తికమకలో పడతారు అతడి కుటుంబసభ్యులు. అయితే అసలు చనిపోయాడా లేదా.. ఒకవేళ చనిపోతే అలా ఎందుకు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. హిలేరియస్‌గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.