విజయ రామరాజు టైటిల్‌రోల్ చేసిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.
ఆదివారం ‘అర్జున్ చక్రవర్తి’ యాంథమ్‌ని మేకర్స్ విడుదల చేశారు. విక్రాంత్ రుద్రా రాసిన ఈ పాటను విఘ్నేష్ భాస్కరన్ స్వరపరిచారు. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్ పాయ్ కలిసి ఆలపించారు. విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న విజువల్స్, వండర్ఫుల్ లొకేషన్స్ ఈ పాటలో చూడొచ్చు. హర్షరోషన్, అజయ్, అజయ్‌ఘోష్, దయానంద్‌రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకాటి.