యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రం తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ పేరుతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎన్.బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఒక రచయిత హత్య నేపథ్యంలో సాగే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని, పిల్లల్లో వచ్చే ఆటిజం వ్యాధి గురించి కూడా చర్చ ఉంటుందని మేకర్స్ తెలిపారు.
హీరో అర్జున్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. రామ్‌కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శరవణన్ అభిమన్యు, నిర్మాత: జి.అరుల్కుమార్, రచన-దర్శకత్వం: దినేష్ లక్ష్మణన్.