Spotify Most Popular musician | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు తన పాటలతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈ సింగర్ తాజాగా మరో రికార్డు అందుకున్నాడు. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన స్పాటిఫై (Spotify)లో 151 మిలియన్ల (15.1 కోట్లు) మంది ఫాలోవర్లను సాధించి ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి సింగర్‌గా అర్జిత్ రికార్డును నెలకొలిపాడు.
ఈ ఘనతతో అర్జిత్ సింగ్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కలిగిన ప్రముఖ గాయనీగాయకులైన ట్రైలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్ వంటి వారిని వెనక్కి నెట్టారు. ట్రైలర్ స్విఫ్ట్‌కు 139.5 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఎడ్ షీరన్‌కు 121 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ విజయం భారతీయ సంగీతానికి ప్రపంచ స్థాయిలో దక్కిన అరుదైన గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
‘తుమ్ హి హో’, ‘కేసరియా’, ‘ఛన్నా మేరేయా’, ‘ఏ దిల్ హై ముష్కిల్’ వంటి ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలతో అర్జిత్ సింగ్ శ్రోతల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అర్జిత్ సింగ్ స్పాటిఫై గ్లోబల్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలవడం ఇది మూడోసారి. ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా, భారతీయ సంగీతం ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని చూపుతుందని నిరూపించింది. ఈ జాబితాలో ఏఆర్ రెహమాన్(14వ స్థానంలో), ప్రీతమ్(21), నేహా కక్కర్(25 వ) స్థానంలో ఉన్నారు.