వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నోబడీ’ ఉపశీర్షిక. ‘పేపర్‌బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.
మనిషి అరిషడ్వర్గాలను ఎలా జయించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని, అంతర్లీనంగా చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని దర్శకుడు జయశంకర్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, డి.శేషురెడ్డి, మారంరెడ్డి నాయుడు, సమర్పణ: ఆర్వీ రెడ్డి, రచన-దర్శకత్వం: జయశంకర్.