పద్మశ్రీ అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఆయన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఇందులో పుష్పరాజ్ అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు బన్నీ.
ఇండస్ట్రీకి వారసుల హవా కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది బాల నటులుగా వచ్చి ఇప్పుడు వెండితెర స్టార్స్ గా మారారు. ఈ క్రమంలో బన్నీ కూతురు అర్హ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. గుణశేఖర్ తెరకెక్కించనున్న శాకుంతలం చిత్రంతో అర్హ వెండితెర డెబ్యూ ఇవ్వనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇందులో ప్రిన్స్ భారత అనే పాత్రలో అర్హ కనిపించనుంది.
అర్హ సోషల్ మీడియాలో తన క్యూట్‌నెస్‌తో నెటిజన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించి అలరించిన అర్హ.. ‘అంజలి అంజలి’ రీ క్రియేట్ సాంగ్లోను కనిపించి అలరించింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తుందనే సరికి అందరి దృష్టి ఈ మూవీపై పడింది.
దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో శాకుంతలం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ , శకుంతలగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
I had an altogether different journey with @Samanthaprabhu2 and am happy to watch Arha debut with her movie. My best wishes to the entire Cast & Crew of #Shakuntalam
— Allu Arjun (@alluarjun) July 15, 2021