ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ అనే లిరికల్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. శ్రీవసంత్ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాయగా..హేషమ్ అబ్దుల్ వాహబ్ ఆలపించారు. ‘అర్థం చేసుకోవు ఎందుకే..ఎన్నెన్నో చెబుతున్నా, ఏవేవో చేస్తున్నా..అర్థం చేసుకోవు ఎందుకే, నా చిన్నిలోకం నువ్వేనని, నాకున్న ప్రాణం నీదేనని..’ అంటూ విఫల ప్రేమలోని బాధను వ్యక్తపరుస్తూ ఈ పాట సాగింది. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: శ్రీవసంత్, నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, లహరిధర్, రచన-దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి.