NBK108 | బాలకృష్ణ సినిమాలో తమిళ సీనియర్ స్టార్ హీరో?
Aravind swamy In NBK108 | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా విజయం బాలయ్యకు మంచి బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తుంది. కథ నచ్చడంతో అరవింద్ స్వామి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక అరవింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం తర్వాత రామ్‌చరణ్ ‘ధృవ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో కీలకపాత్ర పోషించనుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని అనీల్‌రావిపూడి ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నాడట. బాలయ్యకు కూతురుగా ‘పెళ్లి సందD’ ఫేం శ్రీలీల నటిస్తుంది. ప్రముఖ హీరోయిన్ అంజలీ కీలకపాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
Raviteja | ఆ మూవీ రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కుతుందట..!
Nane Varuven Movie | ధనుష్ ‘నానే వరువెన్’ బిగ్ అప్డేట్..!
Brahmstra Movie | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘బ్రహ్మస్త్ర’..!
Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

