Brahmstra Movie | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ‘బ్రహ్మస్త్ర’..!
Brahmstra Movie Creates New Record | ప్రస్తుతం ఇండియాలో ‘బ్రహ్మస్త్ర’ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఉంది. ఫాంటసీ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటు సినిమాపై హైప్ క్రియేట్చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సాధించింది.
ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవగా.. భారీ స్థాయిలో టిక్కెట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కేవలం ఒక్క ‘పివీఆర్’ మల్టీప్లెక్స్‌లలోనే ఈ చిత్రం 1లక్ష టిక్కెట్లు అమ్ముడు పోయాయట. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఏ సినిమాకు ఈ స్థాయిలో టిక్కెట్ బుకింగ్స్ జరుగలేదట. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మస్త్ర మొదటి రోజు సమారుగా రూ.30 నుండి రూ.35 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సాధిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రం దాదాపు రూ.8 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసిందట. ఇక తెలుగులో కూడా ప్రీ బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయట.
‘బ్రహ్మస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Also:
Brahmastra | ఓపెనింగ్ డేన బ్రహ్మాస్త్ర ఈ మ్యాజిక్ ఫిగర్ అందుకునేనా..?
Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

