Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావమంటూ తాగు, సాగునీటికి ఆంక్షలు విధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్షదోరణి వల్ల మంజీరా జలాలు ( Manjeera Water ) వృథాగా పోయిన ఘటన సాక్షాత్తు నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. మెట్టుగూడ( Mettuguda) లో కేబుల్ వైర్ల ఏర్పాటు కోసం రహదారిపై జేసీబీతో చేపట్టిన తవ్వకాల్లో భాగంగా భూగర్భంలోని మంజీరా తాగునీటి పైప్‌లైన్ ఒక్కసారిగా పగిలిపోయింది.
దీంతో వేలాది లీటర్ల స్వచ్ఛమైన మంచినీరు రహదారిపై ఏరులై పారుతూ వృథాగా పోతోంది. రోడ్డు మొత్తం జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టడంతో పాటు, నిర్లక్ష్యంగా తవ్వకాలు జరిపిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
MLA Madhavaram krishna rao | హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి.. సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

