Raviteja | ఆ మూవీ రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కుతుందట..!
‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ప్రేక్షకులనే కాదు రవితేజ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ఈ రెండు సినిమా ఫలితాలతో మాస్రాజ తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. ప్రస్తుతం ఈయన జెట్ స్పీడులో సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన చిత్రబృందం ప్రస్తుతం కీలక ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్నట్లు’ తెలిపాడు. అంతేకాకుండా ‘ఈ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం, నడక అండ్ గెటప్ కూడా భిన్నంగా ఉంటుందని’ వెల్లడించాడు. ఈ మాటలు రవితేజ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ను నింపాయి. ఇక ఈ చిత్రం ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కనుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది.
Read Also:
Chup Trailer | ఆర్టిస్ట్ సీరియల్ కిల్లర్‌గా మారితే..దుల్కర్ సల్మాన్ ‘చుప్’ ట్రైలర్
Abhiram Daggubati | క్రేజీ న్యూస్..రానా తమ్ముడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

