టాలీవుడ్ అగ్రనిర్మాత దగ్గుబాటి సురేశ్ చిన్న కుమారుడు అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అభిరామ్ డెబ్యూ సినిమాపై అప్డేట్ చాలా రోజుల తర్వాత ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వంలో ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నట్టు తాజాగా ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
‘అహింస’ (Ahimsa) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. లేటెస్ట్ టాక్ ప్రకారం సెప్టెంబర్ 30న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా..ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.
డెబ్యూ మూవీలో లవర్ బాయ్ పాత్రలో యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నాడట అభిరామ్. 2019లో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సీత చిత్రాన్ని తెరకెక్కించాడు తేజ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయిన డైరెక్టర్ల లిస్టులో ముందువరుసలో ఉంటాడు తేజ. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది చూడాలి.
Read Also : Pawan Kalyan | ‘సాహో’ దర్శకుడితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ?
Read Also : Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?