Nane Varuven Movie | ధనుష్ ‘నానే వరువెన్’ బిగ్ అప్డేట్..!
Nane Varuven First Single | ఇటీవలే తిరుచిత్రంబలంతో భారీ విజయాన్ని సాధించాడు ధనుష్. గత నెల 18న విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా తిరు మూవీ నిలిచింది. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సార్’ చిత్రీకరణ దశలో ఉండగా.. ‘నానే వరువెన్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నానే వరువన్ చిత్రానికి సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
లేటెస్ట్గా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను బుధవారం సాయంత్రం 4.40 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ బోట్లో కూర్చొని ఉన్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ చిత్రంలో ధనుష్ డ్యయల్ రోల్లో నటించాడు. హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను ధనుష్ ఈ చిత్రంలో పోషించడం విశేషం. సెల్వరాఘవన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించాడు ధనుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్రమ్ హీరోయిన్గా నటించింది.
உங்கள் நெஞ்சத்தை வருடவரும் இசை! #NaaneVaruven திரைப்படத்தின் முதல் lyrical video 7/9/22 அன்று, மாலை 4:40'க்கு வெளியிடப்படும் என்பதை மகிழ்வோடு தெரிவித்து கொள்கிறேன் @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @Rvijaimurugan @saregamasouth pic.twitter.com/Fj6TxfiQJv
— Kalaippuli S Thanu (@theVcreations) September 5, 2022
Read Also:
Karthikeya-2 | యూఎస్ఏలో ‘కార్తికేయ-2’ అరుదైన ఘనత.. తొలి తెలుగు చిత్రంగా సరికొత్త రికార్డు
Abhiram Daggubati | క్రేజీ న్యూస్..రానా తమ్ముడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!
Manchu Manoj | రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

