Karthikeya-2 | యూఎస్ఏలో ‘కార్తికేయ-2’ అరుదైన ఘనత.. తొలి తెలుగు చిత్రంగా సరికొత్త రికార్డు
Karthikeya-2 Record In USA | ఇంకా కొన్ని చోట్ల ‘కార్తికేయ-2’ హవానే నడుస్తుంది. సినిమా విడుదలై నెల రోజులు దగ్గరికొస్తున్నా సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ ‘కార్తికేయ-2’ నిలిచింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలోనూ ఈ చిత్రం డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్లో ‘బాహుబలి’, ‘పుష్ప’ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు 100కోట్లకు పైగా గ్రాస్‌ను.. 50కోట్లకు పైగా షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది.
‘కార్తికేయ-2’ యూఎస్ఏలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్ర యూఎస్ఏలో 1.5 మిలియన్ డాలర్లు సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా నాలుగో వారంలో 80 పైగా లోకేషన్లలో రన్ అవుతున్నమొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగులో ‘గీతా గోవిందం’ తర్వాత అత్యధిక ప్రాఫిట్స్ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
A HISTORIC FEAT🔥#Karthikeya2 becomes the 1st movie to run at 80+ Locations in the 4th Week at US Box Office crossing a gross of $ 1.5 MILLION and still going strong #KrishnaIsTruth#Karthikeya2Hindi@actor_Nikhil @anupamahere @chandoomondeti @AbhishekOfficl @MayankOfficl pic.twitter.com/NTE78eG7vm
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 4, 2022
Read Also:
సినీ ప్రేమికులకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.75కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం..!
Sita Ramam Movie | అప్పుడే ఓటీటీలోకి ‘సీతారామం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jalsa Movie | ‘జల్సా’ రీ-రిలీజ్‌తో రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

