Brahmastra | ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో ‘బ్రహ్మస్త్ర’ మేకర్స్ అన్ని కోట్లు నష్టపోయారా?
Brahmastra Pre-Release Event | ప్రస్తుతం దక్షిణాది హీరోలు ఉత్తరాదిన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో కంటెంట్ బాగుంటే భారీగా కలెక్షన్లు సాధించొచ్చు అనే ఉద్ధేశంతో ఇప్పుడు నేరుగా తెలుగు వెర్షన్లోనే సినిమాలను డబ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య విడుదలైన ‘పృథ్విరాజ్’, ‘లాల్ సింగ్ చడ్డా’, ‘శంషేరా’ వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్ళు సాధించలేకపోయాయి. ఇక ‘శంషేరా’తో భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న రణ్‌బీర్ ఇప్పుడు ‘బ్రహ్మస్త్ర’తో ఎలాగైనా తెలుగులో భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం బృందం విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఫాంటసీ అడ్వేంచర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ హిందీతో పాటు తెలుగులో కూడా జోరుగా ప్రమోషన్లు జరుపుతున్నారు. ఇప్పటికే వైజాగ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కు తెలుగు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తెలుగులో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపాలని ప్లాన్ చేశాడు.
రామోజీఫిలిం సిటీలో భారీగా అత్యంత గ్రాండియర్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపాలని రాజమౌళి ప్లాన్ చేశాడు. దానికి తగ్గట్టే సెట్‌ను కూడా నిర్మించారు. ఇక ఈ వేడుకకి ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచారు. శుక్రవారం ఉదయం వరకు కూడా ఈ ఈవెంట్ జరుగుతుందనే అందరు భావించారు. కానీ చివరి నిమిషంలో పోలీస్‌ల నుండి పర్మీషన్ రాకపోవడంతో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలో పార్క్ హయత్ హోటల్లో బ్రహ్మస్త్ర టీం ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చి సినిమాను ప్రమోట్ చేశాడు.
అయితే రామోజీఫిలిం సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ దాదాపు రూ.2.25 కోట్లు ఖర్చుపెట్టారట. అంత మొత్తం ఖర్చు పెట్టి.. చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో మేకర్స్ కాస్త నిరాశపడ్డారట. ఇక పార్క్ హయత్ ప్రెస్ మీట్ కోసం సుమారు 10లక్షలు ఖర్చయ్యాయట.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున కీలకపాత్రల్లో నటించగా మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

