Aranmanai 4 |ఈ ఏడాది తెలుగులో విడుదలైన కోలీవుడ్ హార్రర్ కామెడీ జోనర్ సినిమాల్లో ఒకటి అరణ్మనై 4 (Aranmanai 4). అరణ్మనై ఫ్రాంచైజీలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో విడుదలైంది. తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, రామచంద్రరాజు, సంతోష్ ప్రతాప్, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు గ్రాస్ రాబట్టింది. కాగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో మాత్రం నిరాశ పర్చింది. థియేటర్లలో విడుదలైన 48 రోజుల తర్వాత ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
సుందర్ సీ ఈ చిత్రానికి వెంకట్ రాఘవన్, ఎస్బీ రామదాస్‌తో కలిసి కో రైటర్‌గా పనిచేయడం విశేషం. హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కించాయి. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టకుంటుందనేది చూడాలి.
ఓటీటీలోకి అరణ్మనై 4..
Aranmanai 4 is now Streaming in Singapore region Hotstar. After 49 days of Release. #Aranmanai4onHotstar #Aranmanai4 #Aranmanai4Blockbuster @HotstarSG @AvniCinemax @uie_offl @Mdanees_3 @_sgcafe @MoviesSingapore #iKamalBhai #BrandedFeatures pic.twitter.com/HbCj7Xhm3G
— KAMAL BHAI 🇸🇬 (@iKamalBhai) June 21, 2024