AR Rahman | ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చెప్పిన చైనీయుడి కథ
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సౌతిండియా, నార్త్ ఇండియాల (North-South Indias) గురించి ఆయన చెప్పిన విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
చెన్నైలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండియా (దక్షిణ్) (Bollywood) కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సౌతిండియా, నార్త్ ఇండియాల (North-South Indias) గురించి ఆయన చెప్పిన విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వేదిక మీద పంచుకున్నారీ దిగ్గజ సంగీత దర్శకుడు.
రెహమాన్ మాట్లాడుతూ…సౌత్ ఇండియన్స్ (South Indians) కంటే నార్త్ ఇండియన్స్ అందంగా ఉంటారని, నార్త్ సినిమాలు బాగుంటాయని ఓ సందర్భంలో చైనీయుడు నాతో అన్నారు. అతని మాటలతో ఆలోచనలో పడ్డాను. అసలు అతను దక్షిణాది సినిమాలు చూసి ఉంటాడా అనే సందేహం కలిగింది. చూసి ఉంటే అతనలా అనేవాడు కాదు. కానీ చాలా మందిలో ఈ భావన ఉండిపోయింది. నా దృష్టిలో నార్త్ అయినా సౌత్ అయినా ఇండియా ఒక్కటే. మన సినిమాల్లో స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్లను వెలుగులోకి తీసుకురావచ్చు. మన సంస్కృతి సంప్రదాయాలను తెరపై చూపడం ద్వారా వాటి గొప్పదనం ప్రపంచానికి చాటగలం అన్నారు.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
కళ ద్వారా ప్రజల్ని ఏకం చేయాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా రెహమాన్ అన్నారు. ఆ శక్తి సినిమాలకు ఉందన్నారు. రెహమాన్ చేసిన ఈ ప్రసంగం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. స్థానిక నటీనటులను వదిలేసి, పరభాషా ఆర్టిస్టుల వెంట పరుగులు పెట్టే దర్శక నిర్మాతలకు రెహమాన్ తన మాటలతో హితవు చెప్పారు.
Read Also : Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

