కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులు దోచుకుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్లో హీరో, హీరోయిన్ ల నటనను మెచ్చుకుంటూనే, ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన పవన్ సి హెచ్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని , నటుడిగా నాగ చైతన్య మరింత ఎదిగిపోయారని, అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు. సాయిపల్లవి డ్యాన్స్ సంచలనం.. తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె డాన్స్ చేస్తుందని అన్నారు. ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ గురించి మాట్లాడుతూ.. ఆయన మ్యూజిక్ ఓ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Yes @urstrulyMahesh he is super talented and humble …all of us at @KMMC_Chennai are really proud of his success! EPI https://t.co/XCxzuqWrbZ
— A.R.Rahman (@arrahman) September 26, 2021
మహేష్ ట్వీట్‌పై స్పందించిన రెహమాన్.. అవును మహేష్ అతను చాలా ప్రతిభా వంతుడు మరియు అనుకువ కలిగిన వ్యక్తి . అతని విజయం పట్ల నిజంగా గర్వ పడుతున్నాము అని అన్నారు.లవ్ స్టోరీ సినిమా కోసం పవన్ అందించిన మ్యూజిక్ విని ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.