AR Rahman | దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ (Music Director AR Rahman) వివాదాస్పద వార్తలకు వ్యాఖ్యలకు దూరంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న అతడి జీవితం విడాకుల వార్తతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఈ వివాదం సద్దుమణగకముందే రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా రెహమాన్ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలు గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ ఘటన 1985-1986 మధ్యలో జరిగింది. ఈ ఘటన తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి అంటూ ఏఆర్ అన్నారు.
నేను సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో ఓ గిటారిస్ట్(Guitarist) నా వద్దకు ఫుల్‌గా తాగి వచ్చి.. నీకు సంగీతం వచ్చా.. నువ్వు ఏం ప్లే చేస్తున్నావు.. నువ్వు చేసేది సినిమాకు సంబంధించింది అంటూ కామెంట్ చేశాడు. అతడు అలా అనడంతో చాలా ఎమోషనల్ అయ్యాను. అయితే అతడి మాటలు నేను అర్థం చేసుకోవడానికి నాకు వారం పట్టింది. ఆ సమయం నాకు బాగా బాధగా అనిపించింది. ఈ విషయం నేను తర్వాత ఆలోచించినప్పుడు అతడు చెప్పింది నిజమేననిపించింది. నేను ఎవరి కోసం అయితే వర్క్ చేస్తున్నానో ఆ కంపోజర్ల ప్రభావం నాపై ఉంటుందని తర్వాత తెలిసింది. దీంతో తన స్టైల్ ఎలా మార్చుకుంటే బాగుంటుందని ఫోకస్ చేశాను. ఈ విషయం మ్యూజిక్ విషయంలో నా స్టైల్ మార్చుకునేలా చేసింది. అయితే అతడు అన్న మాటలు మాత్రం మర్చిపోవడానికి, బాధలోనుంచి బయటకు వచ్చేందుకు దాదాపు ఏడు సంవత్సరాలు పట్టిందని రెహమాన్ తెలిపారు.