AR Rahman breaks silence | బాలీవుడ్లో మతపరమైన ధోరణులు పెరిగాయంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్లో పవర్ షిప్ట్ మారిందని సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి పవర్ వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి మతపరమైన అంశం ఓ కారణమై ఉండొచ్చు. అలాగే ‘ఛావా’ వంటి కొన్ని ప్రాజెక్టులు విభజనను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. అయితే రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో ఆయన తాజాగా తన వివరణను ఇస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తూ భారతదేశం పట్ల తనకున్న అంకితభావాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఒక స్టేడియంలో వేలాదిమంది అభిమానులు ‘మా తుఝే సలామ్’ పాడుతున్న వీడియోను షేర్ చేస్తూ తన సందేశాన్ని వినిపించారు.
భారతదేశమే తన స్ఫూర్తి అని, గురువు, తన ఇల్లు అని పేర్కొన్న రెహమాన్, సంగీతం ఎప్పుడూ తనను భారతీయ సంస్కృతితో అనుసంధానించే మార్గంగానే ఉందని తెలిపారు. కొన్నిసార్లు తన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, అయితే తన ఉద్దేశ్యం ఎప్పుడూ దేశాన్ని గౌరవించడం, సేవ చేయడం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదని, తనలోని నిజాయితీని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే తను ఎల్లప్పుడూ భారతదేశంలోని బహుళ సంస్కృతులను ప్రోత్సహిస్తున్నానని గుర్తు చేస్తూ, తాను చేపట్టిన పలు ప్రాజెక్టులను రెహమాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి సమక్షంలో నిర్వహించిన ‘ఝాలా’ ప్రదర్శన, నాగాలాండ్ యువ సంగీతకారులతో కలిసి పనిచేయడం, భారతదేశపు మొట్టమొదటి మల్టీకల్చరల్ వర్చువల్ బ్యాండ్ ‘సీక్రెట్ మౌంటైన్’ను రూపొందించడం వంటి అంశాలను ఆయన ఉదహరించారు. అలాగే ప్రస్తుతం హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్తో కలిసి ‘రామాయణం’ సినిమాకు సంగీతం అందించడం తన అదృష్టమని పేర్కొన్నారు.
#ARRahman never needed to respond to baseless, crowd-mongering noise from timeline warriors.
But he still stepped in and dropped clarity about his intentions.
The context-less propaganda squad should now log out, go silent, and retire from pretending they understand his music. pic.twitter.com/EJOteOAby5
— ARR EXULTICS 👑 (@exulticsmusical) January 18, 2026