తన మ్యూజిక్ తో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులను మ్యాజిక్ చేశాడు ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహ్మాన్. ఈ స్వర మాంత్రికుడు ఇపుడు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా మారాడు.
ఇహాన్, ఇడిల్సి వర్గాస్ లను సిల్వర్ స్క్రీన్‌పై పరిచయం చేస్తున్నాడు.
జే అనే యువకుడికి ఇష్టమైన మ్యూజిక్, గర్ల్‌ఫ్రెండ్ సోఫీతో సాగిన ప్రయాణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 99 సాంగ్స్.
విశ్వేష్ క్రిష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. జియో స్టూడియోస్ సమర్పణలో వైఎం మూవీస్‌తో అసోసియేట్ అవుతూ ఐడియల్ ఎంటర్ టైన్ మెంట్ సహ నిర్మాణంలో వస్తోందీ ప్రాజెక్టు.
ఇదిగో 99 సాంగ్స్ తెలుగు ట్రైలర్..ఏప్రిల్ 16న తెలుగు, హిందీ , తమిళ భాషల్లో థియేటర్లలో కానుందని ఏఆర్ రెహ్మాన్ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
ఇదిగో 99 సాంగ్స్ తెలుగు ట్రైలర్ !
— A.R.Rahman (@arrahman) March 23, 2021
April 16 , 2021 న హిందీ , తమిళ్ మరియు తెలుగులో ధియేటర్లలో రిలీస్ కానున్నది.https://t.co/ZjUywzem5Y
Directed by @vishweshk and featuring the talented actors @itsEhanBhat #EdilsyVargas @mkoirala @ranjitbarot @Lisaraniray #99Songs