Jason Momoa | ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కరణ్ అర్జున్ అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సాధించింది. మళ్ళీ ఈ కాంబోను రిపీట్ చేయాలని ఎంత మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించినా కుదరలేదు. కాగా ఇటీవలే విడుదలైన పఠాన్‌లో పది నిమిషాలుకనిపిస్తేనే థియేటర్లు ఊగిపోయాయి. కేవలం వీరిద్దరిని స్క్రీన్‌పై చూడాడానికి రీపీటెడ్గా ఆడియెన్స్ వచ్చారంటే వీళ్ల కాంబోపై ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. కాగా మళ్ళీ వీళ్లద్దిరినీ స్క్రీన్‌పై ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లలో చూపించాలని యష్ రాజ్ ఫిలింస్ ప్లాన్ చేసింది. అది కూడా టైగర్ వర్సెస్ పఠాన్ టైటిల్‌తో.
ఇటీవలే యష్ రాజ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా ఇదే విషయాన్ని స్వయంగా తెలిపాడు. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాకు బ్రహ్మస్త్రం ఫేం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది మొదలు పెట్టి ఆ తర్వాత ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆదిత్య చోప్రా తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా హాలీవుడ్ నటుడుని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మేయిన్ విలన్‌గా అక్వామాన్ హీరో జేసన్ మోమోవాను నటింపజేయాలని మేకర్స్ ప్రయత్నాలు జరుపుతున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఒకవేళ జేసన్ నటిస్తే మాత్రం ఈ సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోతుంది. అంతేకాకుండా హాలీవుడ్‌లోనూ యష్ రాజ్ ఫిలింస్ క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఇక దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.