April 3rd Week Movies Releases | ఏప్రిల్ నెల సినిమాలకు మంచి గిట్టుబాటు అయ్యే మాసమని అంటుంటారు. ఎందుకంటే స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడే. కాస్త కంటెంట్ ఉన్న బొమ్మ పడితే రికార్డులు కొల్ల కొట్టే చాన్స్ ఎంతైనా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ నెలలో అలాంటి వండర్స్ క్రియేట్ చేసిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. తొలివారం విడుదలైన రావణాసుర, మీటర్ వారం తిరక్కుండానే షడ్డుకు వెళ్లిపోయాయి. ఇక శాకుంతలం తొలిరోజు నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డీలా పడిపోయింది. రుద్రుడు కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్ల కూడా తీసుకురావడం లేదు. ఇక కాస్తో కాస్తో జనాలను రపిస్తున్న సినిమా విడుదల పార్ట్-1 మాత్రమే. శనివారం విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్‌తో కొంచెం కొంచెం పుంజుకుంటుంది. దీని జోరుమరో రెండు వారాలు కొనసాగే అంశాలు పుష్కలంగా కనిపిస్తుస్తున్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి చాలా సినిమాలే ముస్తాబవుతున్నాయి. సమ్మర్ హీట్‌ను తగ్గించాడనికి వస్తున్న కూల్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఓ లుక్కేద్దాం
థియేటర్లో రిలీజయ్యే సినిమాలు
విరూపాక్ష:
కెరీర్ బిగెనింగ్ నుంచి వినూత్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోతున్నాడు సాయిధరమ్. తన కెరీర్ మొత్తంలో ప్రతిరోజు పండగే తప్పితే మరో కమర్షియల్ బొమ్మ లేదు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ విరూపాక్ష సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తిరుగులేని క్రేజ్ నెలకొల్పాయి. కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హాలో మీరా..!:
సింగిల్ క్యారెక్టర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏప్రిల్ 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మొత్తం మీరా అనే సింగిల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాతో కాకర్ల శ్రీనివాసు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. థ్రిల్లర్ లవర్స్‌కు ఈ వారం రెండు సినిమాలు మంచి విందు భోజనంలా రెడీ అవుతున్నాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు
సోనిలివ్:
గర్మీ(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 21
నెట్‌ఫ్లిక్స్:
హౌ టు గెట్ రిచ్(ఇంగ్లీష్)- ఏఫ్రిల్ 18
ది మార్క్ డ్ హార్ట్(సీజన్ 2)-ఏప్రిల్19
చింప్ ఎంపైర్(డాక్యుమెంటరీ)-ఏప్రిల్ 19
టూత్ పరి(హిందీ)- ఏప్రిల్ 20
డిప్లొమ్యాట్(ఇంగ్లీష్)- ఏప్రిల్ 20
చోటా భీమ్(సీజన్ 17)-ఏప్రిల్ 20
రెడీ(తెలుగు)-ఏప్రిల్ 21
సత్య 2(తెలుగు)-ఏప్రిల్ 21
ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్( ఇంగ్లీష్)- ఏప్రిల్ 21
ఇండియన్ మ్యాచ్ మేకింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 21.
హాట్‌స్టార్:
సుగా(డాక్యుమెంటరీ స్పెషల్)-ఏప్రిల్ 21