Appudo Ippudo Eppudo | యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించగా.. ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రావడం రావడమే మిక్సడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి కార్ రేసర్ అవ్వలన్నది రిషి (నిఖిల్) కల. అయితే అనుకోకుండా తార (రుక్మిణి వసంత్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ కొన్ని కారణల వలన వీరిద్దరికి బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అనంతరం రేసర్ అవ్వాలనే లక్ష్యంతో లండన్ వెళ్లి అక్కడ పార్ట్ టైం పనులు చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలోనే అక్కడ తులసి (దివ్యాంశ కౌశిక్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి మళ్లీ ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అయితే ఇంతలోనే తులసి మయం అవ్వుతుంది. అయితే తులసి మయం ఎలా అవుతుంది. తులసిని పట్టుకోవడానికి రిషి ఏం చేస్తాడు. బ్రేకప్ చెప్పిన తార మళ్లీ లండన్లో రిషి కంట ఎందుకు పడుతుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
high OCTANE thrill meets breezy ROMANCE – Rishi & Tara’s story is an eclectic mix of all 🔥🫰#AppudoIppudoEppudoOnPrime, watch now: https://t.co/E13aHqpQOn pic.twitter.com/apBDEZ56Gw
— prime video IN (@PrimeVideoIN) November 26, 2024