Aparna Balamurali | లావుగా ఉన్నావు హీరోయిన్గా పనికిరావు అన్నారు : అపర్ణా బాలమురళి
Aparna Balamurali | మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూర్య 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అయిన భామకి మాత్రం అవకాశాలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి.
parna Balamurali | మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ అయిన భామకి మాత్రం అవకాశాలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా అనంతరం పలు తమిళ మలయాళ సినిమాల్లో కనిపించిన అపర్ణా తాజాగా ‘రాయన్'(Rayaan) తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్‌కు జోడిగా అపర్ణా నటిస్తుంది. అయితే ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది అపర్ణా. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అందరూ లావుగా ఉన్నావు అమ్మ పాత్రలు చేస్తావా అని కామెంట్లు చేసేవారని తెలిపింది. తాను సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉండేదాన్ని. అప్పుడే జీవి ప్రకాశ్‌తో సర్వం తాలమయం అనే సినిమా చేశాను. అయితే ఈ సినిమా అనంతరం అనుకోకుండా లావయ్యాను. దీంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. ముఖ్యంగా ఎవరిని కలిసిన మీకు అమ్మ పాత్రే సూట్ అవుతుంది అంటూ మెహం మీద చెప్పేవారు. ఈమె హీరోయిన్గా పనికిరాదు అన్న కామెంట్లు కూడా వెనక నుండి వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా నా మీద ట్రోల్స్ వచ్చేవి. అవి చూసి మొదట్లో చాలా బాధపడ్డాను. ఇండస్ట్రీలోకి అస్సలు రాకుండా ఉండాల్సింది అని అనుకున్నాను. లాక్ డౌన్ కంటే ముందు సుధ కొంగరా సినిమా ‘ఆకాశం నీ హద్దురా కు ఆడిషన్ జరిగితే వెళ్లాను. సుధా మేడమ్ నా నటన చూసి ఒకే చేసింది. ఈ సినిమాలో నేను ఉంటాను అని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమాలో బొమ్మి పాత్ర నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు రాయన్‌లో చేస్తున్నా ఇది కూడా నాకు గుర్తుండిపోయో పాత్ర అవుతుందంటూ అపర్ణా చెప్పుకోచ్చింది.
Also Read..
Prabhas Fauji | ఇండో-పాక్ లవ్ స్టోరీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న పాకిస్థాన్ బ్యూటీ.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

