వేలమందికి అన్నదానం చేసిన అపర అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన డొక్క సీతమ్మ జీవితకథ వెండితెర దృశ్యమానం కానుంది. ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ పేరుతో రూపొందించనున్న ఈ చిత్రానికి అచ్చర్ల రాజబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఆర్.బి. నిర్మాత. ఈ సినిమా టైటిల్ హక్కులు తమకే సొంతమని, దీనిని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించామని వీఎన్ఆర్ ఫిల్మ్స్ సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ టైటిల్ ఇవ్వమని కొందరు దర్శకనిర్మాతలు అడిగారు. మేమే సినిమా చేస్తున్నాం కాబట్టి టైటిల్ ఇవ్వడం కుదరదని చెప్పాం. ఈ టైటిల్‌తో మరే దర్శకనిర్మాత సినిమా తీసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు.