Irumudi Movie | ‘ఇరుముడి’ సినిమాపై ఉపాధ్యాయుల ఆగ్రహం.. ఆ సన్నివేశాలు తొలగించాలంటూ డిమాండ్
AP Teachers Federation | రవితేజ నటించిన ఇరుముడి చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా రూపొందించిన అభ్యంతరకర సన్నివేశాలను తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది.
AP Teachers Federation | రవితేజ నటించిన ఇరుముడి చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా రూపొందించిన అభ్యంతరకర సన్నివేశాలను తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది. ఈ సినిమాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూలంగా, బాధ్యతారహితంగా చిత్రీకరించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో చూపించిన దృశ్యాలు కేవలం కల్పితాలుగా కొట్టిపారేయడానికి వీలేకుండా ఉన్నాయని, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు ప్రభుత్వ పాఠశాలను పోలిన లొకేషన్లు మరియు అందులో విద్యార్థులు ధరించిన యూనిఫామ్ అచ్చం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న యూనిఫామ్‌ను పోలి ఉన్నాయని వారు స్పష్టం చేశారు. దీనివల్ల సమాజంలో ప్రభుత్వ విద్యారంగంపై, ఉపాధ్యాయులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి విజ్ఞానాన్ని, నైతిక విలువలను అందించే గురువులను, పాఠశాలలను ఇలా చులకన చేసి చూపడం సినీ పరిశ్రమకు తగదని హెచ్చరించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతోమంది నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యనందిస్తున్నారని, అలాంటి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చిత్ర యూనిట్ స్పందించి తగిన మార్పులు చేయకపోతే, ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా చిత్ర బృందం స్పందించి వివాదాస్పద సన్నివేశాలను తొలగించి, ఉపాధ్యాయ లోకానికి క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

