RGV : తన సినిమాలతోనే కాదు, సంచలన వాఖ్యలతోనూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరో పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఈ ముగ్గురిని కించపరుస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన కేసులో ఆర్జీవీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఒంగోలు తాలూకా పీఎస్‌లో మంగళవారం ఆయనను పోలీసులు 11 గంటల పాటు విచారించారు.
చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత పోస్టింగ్‌లు వెనక ఉన్న వ్యక్తులు ఎవర? అని అర్జీవీపై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. అంతేకాదు వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీ రూ.2 కోట్లు ముట్టిన వ్యవహారంపై కూడా ప్రశ్నలు సంధించారు. అయితే.. విచారణకు ఏమాత్రం ఈ డైరెక్టర్ సహకరించలేదని సమాచారం. ఏ విషయం గురించి అడిగినా తెలియదు, గుర్తు లేదు, పరిచయం లేదు అని సమాధానం ఇచ్చారట. విచారణ సందర్భంగా అధికారులు ఆర్జీబీ ఫోన్‌ను సీజ్ చేశారు. ఆయన ఫోన్లోంచి డేటా సేకరించి మరిన్ని ఆధారాలు, వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.