Sankranthi Tollywood Movies | సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న టాలీవుడ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుతో పాటు ప్రత్యేక షోలకి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రేక్షకల ముందుకు వచ్చి సందడి చేస్తుండగా.. జనవరి 12న బాలకృష్ణ డాకు మహరాజ్, జనవరి 14న వెంకటేశ్ సంక్రాతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ హైకోర్టు పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు ఆధారంగా ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వివరణతో పాటు కొత్త ఆదేశాలను జారీ చేసింది.
తాజా ఆదేశాల ప్రకారం.. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించింది. అలాగే ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా జారీ చేసిన జీవోలో సంక్రాంతికి వస్తున్న డాకు మహరాజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు 4 గంటల బెనిఫిట్ షోను రద్దు చేసింది. అయితే డాకు మహరాజ్ సినిమాకి కొన్ని చోట్ల 4 గంటల షోకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. మరి అవి క్యాన్సిల్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.