Operation Sindoor | జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. ఇందులో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఈ ఘటనపై స్పందించాడు.
వీరత్వం లేని చోట పుణ్యం క్షీణిస్తుంది,
వీరత్వం లేని చోట స్వార్థానిదే విజయం.
దశాబ్దాలుగా సహనం.. సహనం!.. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మీ వెన్నంటే మేము. జైహింద్! అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు.
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है,
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।
-Dinakarదశాబ్దాలుగా సహనం.. సహనం!
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ… pic.twitter.com/sk9BvDHfRE
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2025