AA22xA6 | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. AA22xA6 (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
అల్లు అర్జున్ వ్యక్తిగత జిమ్ ట్రైనర్ లియోర్డ్ స్టీవెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వర్కవుట్ క్లిప్‌ను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ట్రేడ్ మిల్‌పై ఉన్న అల్లు అర్జున్ ఫోన్ వాల్‌పేపర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్లిప్ ఆదివారం ఉదయం 10:18 గంటల(నవంబర్ 16, 2025)కు క్లిక్‌మనిపించింది కాగా టైం కింద 2026 మార్చి 27 కూడా ఉంది. వాల్‌పేపర్‌పై నో స్నాక్ నో షుగర్ నో సోడా అనే మూడు సింపుల్ లైన్స్ ఉన్నాయి.
ఇక లైన్స్ ఈ లైన్స్ చదివిన అభిమానులు అల్లు అర్జున్ 2026 మార్చి 27 వరకు నో స్నాక్ నో షుగర్ నో సోడా నిబంధనను ఫాలో అవుతాడని క్లారిటీకి వచ్చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రమశిక్షణ, ఖచ్చితత్వానికి ఇంప్రెస్ అయిన అభిమానులు తాము కూడా అదే రూల్‌ను ఫాలో అవుతామని చెబుతున్నారు.
అట్లీతో బన్నీ చేయబోయే సినిమా 2027లో పూర్తవుతుందని హింట్ ఇచ్చిన మేకర్స్ ఎప్పటివరకు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#AA22xA6 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/HYyxOKgAII
— Bunny_boy_private (@Bunnyboiprivate) November 16, 2025
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Manchu Lakshmi | మంచు లక్ష్మీ నో ఫిల్టర్ కామెంట్స్ వైరల్ .. సినీ పరిశ్రమ, సమాజంపై బాంబుల వర్షం