Mega 157 Movie | అనుకున్న దానికంటే భోళా శంకర్ సినిమా ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది. చిరు కెరీర్లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం చిరుకు ఒక మంచి హిట్టు కావాలి. అది కూడా ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే భోళాకు విమర్శలు చేసిన వారే.. ఈ సినిమాకు చప్పట్లు కొట్టేలా. దాని కోసం చిరు గట్టిగా ఆలోచించి బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని ముందుగా ప్లాన్ చేసుకున్న వశిష్ట అనుకోని విధంగా చిరు సినిమాను పట్టాలెక్కించాడు.
ఈ మధ్య రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా అనుష్క దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న ఇప్పటివరకు చిరుతో అనుష్క ఒక్క సినిమా కూడా చేయలేదు. స్టాలిన్‌లో ఓ స్పెషల్ సాంగ్ మాత్రం చేసింది. అంతేకాకుండా అనుష్క సైతం ఎన్నో సార్లు చిరుతో సినిమా చేయాలనేది డ్రీమ్ అని చెప్పింది. ఇక ఇన్నాళ్లకు అనుష్క కల తీరబోతుంది.
ఇక మెగా అభిమానులనే కాదు, సగటు ప్రేక్షకుడు సైతం ఈ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం అమితాస్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా కంటే ముందుగా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయినట్లు ఇన్సైడ్ టాక్. చిరు పెద్ద కుమార్తే సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలను నెలల గ్యాప్‌లోనే రిలీజ్ చేసుకునే విధంగా షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడట చిరు.